నిరుద్యోగులైన 15 నుండి 59సంవత్సరాల మధ్య గల స్త్రీ పురుషులకు, ప్రైవేటు రంగంలో పని చేస్తున్న వారికీ, విద్యార్ధులకు, గృహిణులకు అవసరమగు నైపుణ్యాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య సర్వే నిర్వహిస్తున్నదని ఈ సర్వే పక్కాగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ డా. బి. ఆర్. అంబేద్కర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి ఎంపిడిఓలు, మున్సిపల్ కమీషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.