విజయనగరం జిల్లాలో 48 ఇసుక రీచ్ లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి రీచ్ కు ఒక పంచాయతి కార్యదర్శిని ఇంచార్జ్ గా పెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఇసుక కావలసిన వారు పంచాయతి కార్యదర్శి యాప్ లో రిజిస్టర్ చేసుకొని, రసీదును పొందిన తర్వాత ఇసుకను తీసుకు వెళ్లవచ్చునని, పోలీస్ వారు అడ్డుకుంటే ఆ రసీదును చూపిస్తే వదిలేస్తారని తెలిపారు.