గంట్యాడ: పాఠశాల ఉపాధ్యాయుడిపై లైంగిక వేధింపులు కేసు నమోదు
గంట్యాడ మండలంలోని ఓ గ్రామంలో హెచ్ఎం గా పనిచేస్తున్న ఉపాధ్యాయుడి పై శుక్రవారం ఎస్ కోట పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపులు కేసు నమోదైంది. ఓ మహిళ తన కుమారుడి స్టడీ సర్టిఫికెట్ లో తప్పులు సవరించాలని ఉపాధ్యాయుడుని కోరింది. అందుకు ఉపాధ్యాయుడు ఆమెను ఎస్. కోట రమ్మని పిలిచి పని నిమిత్తం బొడ్డవర వెళ్లాలని బైక్ పై తీసుకువెళ్లి కాపు సోంపురం దగ్గర ఓ తోటలో తనపై అత్యాచారయత్నం చేసినట్లు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.