ఎస్ కోట మండలం రాజీపేటలో గల శంబల నగరిలో శుక్రవారం జరిగిన కార్తీక పౌర్ణమి వేడుకల్లో విశాఖ ఎంపీ శ్రీ భరత్ పాల్గొన్నారు. శ్రీగాయత్రీ దేవి అమ్మవారిని దర్శించుకుని అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గోపురంపై ఏర్పాటు చేసిన అఖండ జ్యోతిని వెలిగించారు. గాయత్రీ దేవి కరుణ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.