వేపాడ: పోలింగ్ బూత్ ల కమిటీ నియమకానికి సమావేశం
వేపాడ మండలంలోని పోలింగ్ బూత్ ల కమిటీల నియామకానికి విశాఖ పార్లమెంట్ బిజెపి ప్రధాన కార్యదర్శి శ్రీరంగం దానేషు, జిల్లా కార్యవర్గ సభ్యులు జి మహేష్ ఆధ్వర్యంలో ఆదివారం వేపాడలో సమావేశం నిర్వహించారు. 9 శక్తి కేంద్రాల్లో శక్తి కేంద్ర రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు. బూత్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బిజెపి నాయకులు పవన్ కుమార్, కొట్యాడ రామకోటి తదితరులు పాల్గొన్నారు.