ఎస్. కోట పంచాయతీలో శుక్ర, శనివారాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సర్పంచ్ సంతోష్ కుమార్, ఈవో అనురాధ ఆధ్వర్యంలో సానిటరీ సూపర్వైజర్ ఎం వి ఆర్ ఎల్ ఎస్ ప్రసాద్ తన సిబ్బందితో అలాగే జెసిబి యంత్రం సహాయంతో స్థానిక ముస్లిం వీధి, ఎస్సీ కాలనీ తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు.