వేపాడ పీ హెచ్ సి లో శనివారం వైద్యులు ధరణి ఆధ్వర్యంలో శనివారం ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గైనకాలజిస్ట్ ఎస్ ఫణి శ్రీ 39 మంది గర్భిణీలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించారు. అనంతరం బానాది సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో గర్భిణీలకు ఉచితంగా భోజనం పంపిణీ చేశారు.