ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు ఎస్. కోట నుండి తాటిపూడి, ధర్మవరం మీదుగా విజయనగరం వెళ్లే ప్రయాణికులకు అదనంగా 10 రూపాయలు ఆర్టీసీ చార్జి పెంచుతున్నట్లు డిపో మేనేజర్ కే రమేష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గంట్యాడ మండలంలో నూతనంగా టోల్గేట్ ఏర్పాటు నేపథ్యంలో టోల్గేట్ చార్జీలు చెల్లించే దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రయాణికులు గమనించి సహకరించగలరని కోరారు.