వేపాడ మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో శుక్రవారం లైబ్రేరియన్ ఎం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొని పుస్తక పఠనం చేశారు. గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలని, విద్యార్థులు గ్రంథాలయాలను విరివిగా వినియోగించుకుని తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. తమ గ్రంథాలయంలో అన్ని రకాల పోటీ పరీక్షలకు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు.