సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో గౌరీదేవి అమ్మవారిని ఆనుపు కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోంది. గౌరీదేవి యూత్ సభ్యులందరూ కలిసి నాగుల చవితి రోజు రాత్రి అమ్మవారిని ప్రతిష్టించి పౌర్ణమి రోజున నిమజ్జనం చేయడం ఎప్పటి నుంచే ఇక్కడ ఆచారం. మేళ తాళాలతో డ్యాన్సులతో పౌర్ణమినీ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసిన మహిళలు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తిరువీధిలో పాల్గొంటున్నారు.