పార్వతీపురం: మన్యం జిల్లా గిరిజన గ్రామల రహదారులకు పెద్దపీట
కూటమి ప్రభుత్వం సోమవారం అసెంబీల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు బడ్జెట్లో రూ. 7, 557కోట్లు కేటాయించారు. జిల్లాలోని పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో సుమారు 500 గ్రామాలను అన్ కనెక్టడ్ గ్రామాలుగా గుర్తించారు. కొన్ని గ్రామాలకు కంకర, మట్టి రహదారులు ఉన్నాయి. వాటిని బీటీ రహదారులుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందిస్తుంది.