మన్యం జిల్లాలో ఉన్న కూటమి ముఖ్య నాయకులని గుర్తించాలని జిల్లా భాజపా ఆధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పార్వతీపురం లైన్స్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నామినేటెడ్ పదవులు విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, జిల్లాను కూటమి ముఖ్యనాయకులు గుర్తించాలని కోరారు. ఈ జిల్లాలో బీసీ నాయకులను గుర్తించి నామినేటెడ్ పదవులు ఇచ్చేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.