భామినిలోని దొరగారి చెరువు గట్లు పై ఉపాధి హోమి సిబ్బంది ఆధ్వర్యంలో బ్లాక్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా కొబ్బరి మొక్కలను సర్పంచ్ రాజేశ్ నాటారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఉపాధి హామి వేతన దారుడిపై ఉందని క్షేత్ర సహాయకులు మధు అన్నారు. కార్యక్రమంలో కృష్ణారావు, జి. శ్రీను పాల్గొన్నారు.