పాలకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు డా. సిహెచ్ రామకృష్ణ తెలిపారు. గురువారం 8 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు సూపరిండెంట్ నాగభూషణం పేర్కొన్నారు. అలాగే దృష్టి సమస్యలు గల వారికి ఉచిత ఆప్తాలమిక్ సేవలు అందిస్తున్నామని నిపుణులు నూక లక్ష్మణరావు తెలిపారు. దృష్టిలోపం సమస్యలు గలవారు తమ పేరును ఆసుపత్రిలో ముందుగా నమోదు చేసుకోవాలని రోగులకు సూచించారు.