ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని గురువారం విజయవాడ వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పాలకొండకు చెందిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులపై జరుగుతున్న దాడులను జగన్మోహన్ రెడ్డికి వివరించినట్లు ఎమ్మెల్సీ విక్రాంత్ పేర్కొన్నారు. అందరికీ అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారని అన్నారు.