మన్యం జిల్లాలో ఉపాధి హామీ పనుల ఆమోదం కోసం ప్రతి గ్రామ పంచాయతీలో శుక్రవారం గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గురువారం మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామ సభల పై పలు సూచనలు చేశారు. గ్రామ సభల్లో గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొనేలా మండల అభివృద్ధి అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు.