సీతంపేట గిరిజన బాలికల గురుకుల పాఠశాల రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం హర్షనీయం అని ఐటీడీఎ పీవో వి. వి రమణ గురువారం స్థానిక సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీడీ అన్నదొర, ప్రిన్సిపల్, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.