భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం ఉత్తరాంధ్రకే తలమానికమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం ఆయన విమానాశ్రయ పనులను పరిశీలించారు. గత రెండు నెలల క్రితం నిర్మాణ పనులు పరిశీలించేటప్పుడు 40 శాతం పనులు పూర్తయ్యాయని నేటికీ 50 శాతం పైగా నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. 2026 నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.