కురుపాం ఏజెన్సీ ప్రాంతంలో గజరాజులు ప్రవేశం
కురుపాం మండలం గ్రామీణం గిరిశిఖరాల్లో మళ్ళీ గజరాజులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. బుధవారం తిత్తిరి పంచాయతీ సీడిగూడ తదితర గిరిజన గ్రామాల్లో నాలుగు ఏనుగులు సంచరించడంతో ఒక్కసారిగా గిరిజన ప్రజలు భయాందోళన చెందారు. సీతంపేట, భామిని అటవీ ప్రాంతాల్లో సంచరించిన నాలుగు గజరాజులు మళ్ళీ కురుపాం మండలం ఏజెన్సీ ప్రాంతంలో ప్రవేశించాయి. ఆయా పరిసర గ్రామాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.