ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి. శంకర్రావు అన్నారు. శుక్రవారం కురుపాం మండలం దురుబిల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు ఆకస్మికంగా మరణించడం చాలా బాధాకరమని వారి మృతికి గల కారణాలను 3జిల్లాల కలెక్టర్లను నివేదిక అడిగానని నివేదిక ఇచ్చిన వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.