కురుపాం నియోజకవర్గంలో ఉన్న పంట పొలాలకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే టి. జగదీశ్వరి కోరారు. ఈమేరకు బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో గుమ్మిడి గెడ్డ, వట్టిగెడ్డను అనుసంధానించి, గిరిజన రైతులకు సాగునీరు అందించాలని కోరారు. సాగునీరు లేక గిరిజన రైతులు వర్షాధారంపై ఆధారపడి పంటలు పండిస్తున్నారని తెలిపారు.