వాయుగుండం కారణంగా గ్రామంలో ఏర్పడిన సమస్యలను సర్పంచ్ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించారు. సోమవారం గజపతినగరం మండలంలోని కాలం రాజుపేట గ్రామంలో ఎస్సీ కాలనీ వద్ద మురికి నీరు పేరుకుపోవడంతో మోటార్ పెట్టి తీయించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో విద్యుత్ సిబ్బందితో సమస్యను పరిష్కరించారు. సమస్యలను పరిష్కరించినందుకు సర్పంచ్ గేదల ఈశ్వరరావును పలువురు అభినందించారు.