మెంటాడ మండలం జయితి గ్రామంలో శనివారం స్వయంభూగా వెలసిన శ్రీ భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణీ గట్టుపై నిర్మిస్తున్న ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటుకు దాతలు ఇచ్చిన విరాళాలతో పనులు జరుగుతున్నాయని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గేదెల సత్యం నాయుడు తెలిపారు. ఇంకా నిధులు చాలనందున దాతలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు కు సహకరించాలని కోరుతున్నారు.