బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(బుడా) చైర్మన్ తెంటు లక్షుo నాయుడుని ఆదివారం పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర సన్మానించారు. బుడా చైర్మన్ లక్ష్మునాయుడుగా ఈనెల 27 తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయ్ చంద్రని ఆహ్వానించేందుకు లక్ష్మునాయుడు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు