బొబ్బిలి పట్టణం గొల్లవీధి జంక్షన్లో వెలసిన సిర్లి పోతన్న ఆలయంలో శ్రీ ఎల్లమ్మతల్లి అమ్మవారు ఆదివారం శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దసరా నవరాత్రులు సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లుతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తులను కూడా కూరగాయలతో అలంకరించారు. శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. వనం, చదురుగుడుల్లో కూడా ప్రత్యేక పూజలు జరిగాయి.