బొబ్బిలి మండలం జగన్నాధపురం గ్రామ పంచాయతీలో మంగళవారం వరల్డ్ టాయిలెట్ డే కార్యక్రమంలో సర్పంచ్ బొద్దల పద్మ, ఎంపీటీసీ సభ్యులు రౌతు తిరుపతి రావు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరుగుదొడ్లు ప్రతి ఇంటికి ఉండాలని సర్పంచ్ తెలియజేశారు. ఎవరైతే మరుగుదొడ్లు వాడలేదు వారికి మరుగుదొడ్ల యొక్క ఉపయోగాన్ని అవగాహన కల్పించారు.