విద్యారంగ పరిరక్షణే ధ్యేయంగా కృషి చేయాలని ఉత్తరాంధ్ర పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కె. విజయగౌరి అన్నారు. బొబ్బిలి నోబుల్ స్కూల్లో ఆదివారం యుటిఎఫ్ మండలం, పట్టణ స్వర్ణోత్సవ మహాసభలు కార్యవర్గ సభ్యులు ఆనెం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న సంస్కరణలు నేడు విద్యారంగానికి సవాళ్లుగా ఉన్నాయని, భవిష్యత్తులో ఉద్యమాలతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.