బొబ్బిలి పట్టణం వాసు కాలేజ్ దగ్గర సోమవారం ఉదయం ఓ మహిళ ఫిట్స్ వచ్చి కరెంటు స్తంభాన్ని గుద్దుకుంది. తలకి తీవ్ర గాయమై శరీరం మొత్తం రక్త స్రావమైంది. ఆవిడ ఏం మాట్లాడటం లేదు నోటిలో నుంచి మాట కూడా రావడం లేదు. ఆమెను పరిశీలించిన ఏఐఎస్ఎఫ్ నాయకులు చూసి హుటాహుటిన దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అలాగే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు.