కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బ్రహ్మంగారిమఠం మండలం మదిరెడ్డిపాలెంలో భూవివాదంతో దాయాదుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణ సమయంలో నాలుగు ద్విచక్రవాహనాలు కూడా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.