ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లోని సింగ్ నగర్ వైయస్సార్ కాలనీ ప్రజలు అర్ధరాత్రి రోడ్డు పైకి వచ్చారు. మరల బుడమేరు కట్ట తెగిందని, ఇళ్లలోకి నీరు చేరే అవకాశం ఉందని ప్రచారం జరగటంతో పసి పిల్లలను వేసుకొని రోడ్డు పైకి వచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బుడమేరు కట్ట ఎక్కడా తెగలేదని అటువంటి వదంతులను ప్రజలు నమ్మవద్దని సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దు అంటూ ప్రజలకు ధైర్యం చెప్పారు.