అపార్ నమోదులో జిల్లాలో ఉదయగిరి తొలి స్థానంలో నిలిచిందని మండల విద్యాశాఖ అధికారి-2 తోట శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ. అపార్ నమోదులో జిల్లాలోని 38 మండలాలకు గాను ఉదయగిరి 58. 76%తో మొదటి స్థానం దక్కించుకుందన్నారు. ఉదయగిరిని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన హెచ్. ఏం కార్యాలయం సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా నెల్లూరు అర్బన్, రూరల్ చివరి స్థానంలో కొనసాగడం గమనార్హం.