దుత్తలూరు: ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగింపు

75பார்த்தது
దుత్తలూరు: ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగింపు
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో కొంతమంది ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించారని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు మంగళవారం ఆ గ్రామంలో పర్యటించారు. సర్వేల ప్రకారంగా ప్రభుత్వ భూములను గుర్తించి ఆక్రమణలు తొలగించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించాలని చూస్తే చర్యలు చాలా తీవ్రతరంగా ఉంటాయని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி