నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామంలో రాత్రి నుంచి త్రి ఫేస్ కరెంటు లేకపోవడంతో పంచాయతీ వాటర్ రాక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. గ్రామస్తులను చూసి స్పందించిన సర్పంచ్ తలారి పెంచలమ్మ తన సొంత ఖర్చులతో ఇంటింటికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. గ్రామంలో నీటి కొరతను చూసి వెంటనే స్పందించిన విధానానికి సర్పంచ్ తలారి పెంచలమ్మ కు గ్రామస్తులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు.