నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో సర్పంచ్ తలారి పెంచలమ్మ,వల్లూరు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సైడ్ కాలువల పూడికను తొలగించి గ్రామం మొత్తం బ్లీచింగ్ తో శానిటైజింగ్ చేశారు. వల్లూరు హర్షవర్ధన్ రెడ్డి తండ్రి అనంత పద్మనాభ రెడ్డి జూన్ 29వ తేదీన స్వర్గస్తులైన సంగతి అందరికి తెలిసిందే. తన తండ్రి చేపట్టిన ప్రతి పనిని గ్రామంలో పూర్తి చేసి తన తండ్రి లేని లోటు ప్రజల్లో రానివ్వనని ఆయన అన్నాడు.