నెల్లూరు జిల్లా పొదలకూరు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్ ను కలెక్టర్ ఓ. ఆనంద్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులు పరిశీలించారు. త్వరలో లాటరీల ద్వారా మద్యం షాపులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు సూచనలు చేశారు. మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులు, వాటి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ తో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నారు.