నెల్లూరు జిల్లాలో ఉన్న అంగన్వాడీ మినీ సెంటర్ లను మెయిన్ సెంటర్ లగా మార్చాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు స్థానిక వీఆర్సి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో యూనియన్ నేత రెహనా బేగం పాల్గొన్నారు.