ఎమ్మిగనూరు: ఎమ్మెల్యే మాటలు బేఖాతర్ చేస్తున్న మున్సిపల్ కమిషనర్
ఎమ్మిగనూరులో రోజురోజుకు కుక్కల బెడద ఎక్కువవుతోంది. కుక్కలు దాడులు చేస్తుండడంతో పలువురు గాయాలపాలై ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీనిని గమనించిన ఎమ్మెల్యే రెండు నెలలు కిందట కుక్కల బెడద తగ్గించాలని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మున్సిపల్ సిబ్బంది స్పందించకపోవడం విడ్డురంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటూ గురువారం స్థానికులు ఆరోపించారు.