ఎమ్మిగనూరు నియోజవర్గ ఇన్చార్జి బుట్టా రేణుక ఆదేశాలు మేరకు బుట్టా ప్రతుల్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో అన్నమయ్య సర్కిల్లో వెంకటసాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల లడ్డూపై రాజకీయ వివాదం రేపుతున్న చంద్రబాబుకు బుద్ధిరావాలని కోరారు. వైసీపీ నాయకులు బుట్టా ప్రతుల్, వై. రుద్రగౌడ్, బీఆర్ బసిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.