ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో శనివారం ఒక వ్యక్తి మృతి చెందాడు. సి. బెళగల్ మండలం యనగండ్లకు చెందిన తెలుగు వెంకటేష్ (49) కోటకొండలో ఓ యజమాని దగ్గర మామిడి తోటలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. యనగండ్లకు నుంచి కోటకొండకు బైక్ పై వెళ్తుండగా, గాజులదిన్నె ప్రాజెక్టు క్రాస్ రోడ్డు దాటుతుండగా, ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. కోడుమూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.