పత్తికొండ పట్టణంలోని ధనలక్ష్మి ప్రింటర్స్ సమీపంలో ప్రధాన రహదారిలో ఆదివారం అర్బన్ సీఐ జయన్న ఆధ్వర్యంలో ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లను, వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లను, గతంలో వాహనదారులు జరిమానాలు చెల్లించకుండా పెండింగ్‌లో ఉన్న వాహనాలను, ద్విచక్ర వాహనాలకు డ్రంక్ అండ్ డ్రైవ్ క్షుణ్ణంగా పరిశీలించి కేసులు నమోదు చేశారు.