ప్రజాస్వామ్య వ్యవస్థలో భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి జర్నలిస్టుల కర్తవ్యాన్ని తెలియజేస్తూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు పత్రిక స్వేచ్ఛకు ఊపిరినిచ్చాయని ఆదివారం పత్తికొండలో ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గం అధ్యక్షుడు సాల్ రంగడు అన్నారు. పత్తికొండలో వారు మాట్లాడారు. పత్రిక స్వేచ్ఛను కాపాడే విధంగా సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం సమర్థనీయమన్నారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు పాల్గొన్నారు.