పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలో పనులు లేక కూలీలు ఊరు వదులుతున్నారు. సోమవారం కొందమంది గ్రామస్తులు వలస బాట పట్టారు. వలస నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పదేపదే చెబుతున్నా ఆచరణ కనపడటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పనులు లేక కూలీలు ఊరు వదిలి ఇతర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. తుగ్గలి మండలంలోని పలు గ్రామాల్లో ఊళ్ళన్నీ ఖాళీ అవుతున్నాయి.