ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా రెండు తెలుగు రాష్ట్రాలు వర్గీకరణను అమలు చేయకపోవడం బాధాకరమని ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు భాస్కర్ మాదిగ అన్నారు. ఆదివారం వెల్దుర్తిలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో మాట్లాడారు. ఇప్పటికే హర్యానాలో వర్గీకరణ అమలు చేశారని, ఏపీలో కూడా అమలయ్యే విధంగా కర్నూలు జిల్లాకు 5న మందకృష్ణ మాదిగ వస్తున్నారన్నారు.