దసరా సెలవులకు తాళం వేసి వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పత్తికొండ నియోజకవర్గంలోని పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్, మద్దికెర ఎస్సై విజయకుమార్, వెల్దుర్తి ఎస్సై అశోక్ సూచించారు. ఆదివారం ఆయా మండలాల్లోని గ్రామాల్లో ప్రజలతో వారు మాట్లాడారు. ఇంట్లో విలువలైన వస్తువులు, నగదు ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని, అనుమానితులు కనిపిస్తే 100, 112కు సమాచారం ఇవ్వాలని, గొడవలకు దూరంగా ఉండాలన్నారు.