క్రిష్ణగిరి మండలంలోని మన్నెకుంటకు చెందిన కొణిదేల వెంకట్రాముడు (44) అప్పుల బాధ తాళలేక మంగళవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పంటల సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేననే నిరాశకు గురై తన పొలంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. భార్య నాగలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు.