పత్తికొండ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఆదివారం అర్బన్ సీఐ జయన్న వాహనాల తనిఖీ నిర్వహించారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్సులను తనిఖీ చేశారు. అనంతరం సీఐ మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనాలు నడుపుతున్నప్పుడు ఫోన్ లు మాట్లాడవద్దని, అలా చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు.