నందికొట్కూరు పాఠశాల స్థాయిలోని విద్యార్థిని విద్యార్థులకు వృత్తి విద్యపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో వారికి ఎంతో దోహద పడుతుందని ఇలాంటి వృత్తి విద్య కోర్సులను విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన ఉపాధ్యాయులు రామచంద్రమూర్తి అన్నారు. ఆదివారం నందికొట్కూరు కొణిదెల గ్రామంలో నర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ మెటల్ స్టోర్స్, ఎలక్ట్రికల్ శాఖ టైలరింగ్ లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.