మంత్రాలయం శ్రీ మఠంలో భక్తుల కోలాహలం
మంత్రాలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. గురువారం దీపావళి సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులు ముందుగా తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు చేసి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.