మంత్రాలయంలో ప్రసిద్ధ గాంచిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి కుంకుమ అర్చ చేసి మంగళారతి సమర్పించారు. అనంతరం, పీఠాధిపతులు శ్రీ సుభుదీంద్ర తీర్థుల ఆధ్వర్యంలో రాఘవేంద్ర స్వామి మూల బృందావణానికి విశేష అభిషేకాలు చేశారు. గోవుపూజ, తులసి పూజ, తైల అభ్యంజనం వంటి పూజలు నిర్వహించి భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.