పెద్దకడబూరులోని పాత పంచాయతీ ఆఫీసులో మంగళవారం కర్నూలు అమీలియో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, ఎస్ఐ నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఆసుపత్రి ప్రతినిధి, ఆప్టికల్ అసిస్టెంట్ ఎన్ జీ సింహా వీరన్న కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కంటి ఆపరేషన్ అవసరమైన రోగులకు అమీలియో ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామన్నారు.